AP Special Status: Open Letter to Pawan Kalyan, Modi, CBN, Venkaih Naidu

రాష్ట్రాన్ని విభజించేటప్పుడు తెలుగు ప్రజలు మొత్తం వద్దు అని 2 నెలల పాటు ఉద్యమం చేసినా పట్టించుకోలేదు. మాకు ఆల్రెడీ ఇచ్చాం అని చెప్పినా ఆ స్పెషల్ స్టేట్ కోసం ఎంత గొడవ చేస్తున్నా కేంద్రం పట్టిచుకోవడం లేదు. ఇవ్వన్ని చూసి అసలు మేము ఈ దేశానికి చెందిన ప్రజలం కాదా? మేము ఏమైపోయినా పర్వాలేదా అని బాధ పడటం సహజం కాదా? అదే బాధ తో ఒక వ్యక్తీ ఆల్రెడీ ప్రాణాలని తీసుకున్నాడు. అయినా మన రాజకీయ నాయకులుకి ఏమి బాధ లేదు, ఎందుకంటే చనిపోయింది వాళ్ళ ఇంటిలో వ్యక్తి కాదు కాబట్టి.

రెస్పాన్స్ టూ  పవన్ కళ్యాన్స్ ట్విట్స్:- (Response to Pawan Kalyan Tweets)

Pawan Kalyan on AP Specia Statusకేంద్రం చేస్తున్న మోసం వల్ల మనలో ఒకడు చనిపోతే నేను ఇప్పుడు మాట్లాడలేను అనటం నాయకుడి లక్షణం కాదు అన్నయ్యా. మీరు చేస్తున్న నీచ రాజకీయాలా వల్ల ఒక అమాయకుడు రాష్ట్రం కోసం ప్రాణాలను త్యాగం చేసాడు, ఇంకా ఎంత మంది చావాలిరా అని కాలర్ పట్టుకుని అడిగే దమ్మున్న లీడర్ కావాలి మాకు.

మీకు మాకు ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా, కేవలం మా డబ్బులు తీసుకోని మాకు ఎంటర్టైన్మెంట్ పంచె ఒక సినిమా యాక్టర్ ని ఇంత గా అభిమానిస్తూ మీరు ఏది చెపితే మీ అభిమానులు (వాళ్ళ లో నేను కూడా ఒకడిని) మిమ్మలిని నమ్మి మీరు చెప్పిన వాడికి ఓట్ వేసారు. అటువంటి ప్రజల బ్రతుకులు నాశనం అయిపోతుంటే కేవలం ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతూ ఉంటె ఎం సాధిస్తాం అన్నయ్య. ఒకవేళ Andhra Pradesh కి స్పెషల్ స్టేటస్ రాకపోతే, మాకు ద్రోహం చేసిన వాళ్ళలో నువ్వే మొదటివాడివి.

 

వెంకయ్య నాయుడు గారికి:- (To Venkaih Naidu)

Venkaih Naidu on AP Special Statusమీరు చాలా గొప్ప వాళ్ళు అని, విద్యావంతులు అని, మీరు కేంద్ర మంత్రి అవటం వల్ల మన తెలుగు వాళ్ళ కి మంచి జరుగుతుంది అని భావించాం. రాష్ట్ర విభజనప్పుడు మీరు ఇచ్చే 5 ఇయర్స్ ఏమి సరిపోతుంది, 15 ఇయర్స్ మీటింగ్స్ లో మీ ఉపన్యాసాలు అన్ని విని కనీసం ఒక్కడిన మనకు మంచి చెయ్యాలని కోరుకుంటున్నాడు అనుకున్నాం.

మరి ఇప్పుడు నీకు ఏమైంది వెంకయ్య నాయడు గారు? ఓపెన్ గానే AP కి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం కుదరదు అని నోటికి వాచినట్టు వాగేస్తున్నారు? మీరు బయట కనిపిస్తే చెప్పు తీసుకుని కొట్టాలి అని ఉంది, ఎప్పుడు వస్తున్నారు బయటికి?

 

నరేంద్ర మోడీ గారికి:- (To Narendra Modi)

Narendra Modi on AP Special Statusగుజరాత్ అనే ఒక రాష్ట్రం లో మా బాష మాట్లాడే జనాలు కారు, మా కల్చర్ కాదు, కేవలం ఇది! మన దేశం, మన దేశం లో ఒక రాష్ట్రానికి సంబందిచినా వ్యక్తీ మంచి పనులు చేస్తున్నాడు అని విని (కేవలం విన్నాం, ఎప్పుడు చూడలేదు) మీ మాటలు నమ్మి మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఓట్లు వేసాం. మీ ఎలక్షన్స్ కాంపైన్ లో మీరు చేసిన వ్యాక్యలు విని నిజం గా లీడర్ అంటే ఇలా ఉండాలి, మా బాధ అర్ధం చేసుకున్నాడు, మా ప్రజలు కి మంచి చేస్తాడు అని భావిచాం!

ఇప్పుడు మీరు మా జీవితాలతో మా భవిష్యత్ తరాల భవిష్యత్ లో నీచ రాయకీయాలు చేస్తున్నారు. మా దృష్టిలో ఇప్పుడు మీరు మాకు ప్రధాని కాదు, గుజరాత్ కి చెందిన ఒక నీచ రాజకీయ నాయకుడు.

 

చంద్ర బాబు గారికి:- (To Nara Chandra Babu Naidu)

Chandrababu Naidu on AP Special Statusమీ మీద ఇది వరకు ఎప్పుడు అభిమానం కాని, నమ్మకం కాని లేని వ్యక్తి ని నేను. కానీ, రాష్ట్రాన్ని విడగోట్టేప్పుడు మిగతా రాజకీయ పార్టీ లు చేసిన నీచ రాజకుయాలు ని చూసి ఉన్న వాళ్ళలో మిరే ఎంతో కొంత మంచి వాళ్ళు, ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితి ని మీరు ఒక్కరే సరిదిద్దగలరు అని భావించి జీవితం లో మొదటిసారి మీకు ఓట్ వేసా(నాలాంటి వాళ్ళు చాల మంది ఉన్నారు)

మీ కళ్ళ ముందు ఇంత గోరాలు జరుగుతుంటే… ఒక రాష్ట్ర నాయకుడి గా ఎంచేస్తున్నారు? మా జీవితాలు ఏమైపోయినా పర్లేదు, మీరు మీ కుటుంబం, మీ రాజకీయ నాయకులు మా మీద పది దోచుకుని ఎలాగూ బ్రతికేస్తున్నారు. మరి మా విషయం ఏంటి? మీ మీద నమ్మకం పెట్టుకున్నా ప్రజల ని మోసం చేస్తే చరిత్ర లో నీచుడి గా మిగిలిపోతారు!

 

Y.S జగన్ గారికి:- (To Y.S Jaganmohan Reddy)

YS Jagan on AP Special Statusమీ రీజెన్స్ ఏమైనప్పటికీ కనీసం ఇప్పటికైనా మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్స్ .

కాంగ్రెస్ పార్టీ వాళ్లకి:- (To Congress Party)
మీ గురించి మేము ఎప్పుడో….!  మర్చిపోయాం ! మీరు కూడా మర్చిపోండి…..!

చిట్ట చివరిగా :-
శివాజీ గారికి:-  (Hero Sivaji)

Telugu Actor Sivaji on AP Special Statusభయ్యా, మీకు సినిమా పరంగా నేను అభిమానిని కాదు. మీ గురించి పట్టించుకున్నది తక్కువే మీ గురించి మాకు తెలిసింది తక్కువే, కాని నిజంగా మన రాష్ట్రం లో మైండ్ పనిచేస్తుంది మీకు ఒక్కరికే, మన బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి రా కదలండి రా అని అరిచి మొత్తుకుంటున్నారు. Hats off to you and to your Efforts..!

ఆకరిగా ఒక్క మాట:-
తెలుగు వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు. మీరు ఏ నాటకాలు ఆడిన ఏమి పట్టించుకోరు అని అనుకునే వాళ్ళు కాదు, ఒక్కసారి కాంగ్రెస్ పరిస్థితి చుడండి మళ్లి తెలుగు నేలపైన అడుగు పెడితే తాట తీస్తారు.

Comments

comments

About The Author